Wednesday, August 15, 2007

అమె రాక సందర్భం గా !

నాకు కవితలూ, హైకూలూ లాంటి పెద్ద పెద్ద మాటలు తెలీదు.

తెలిసింది ఓక్కటే

మనసు పూలకి అక్షరాల తొ మాల కట్టటం -


కదిలే రైలు

ఆగిపోయిన జీవితం

మిగిలి పోయిన స్నేహం
______________

నిజం నిప్పు

అబద్దం మండే సూర్యుడు

అల, సముద్రం సునామీలో భాగం!

______________
పెదాల చివర arc

గుండెల్లోగ్ sparc

గుర్తుండి పోయిన French curve

______________


ఆరిపోయిన వెలుగు

గుండెలో కణిక

ఆవిరైన కన్నీరు.

- చనిపోయిన జ్యోతి ని గుర్తు చేసుకుంటూ!

______________
కిటికి లోంచి గాలి

కేలు మీటిన ముంగురులు

మనసులో నైలు ప్రవాహం.

- చిన్నప్పడు ముందు seat లో అమ్మాయి జ్హ్నాపకం

______________
పదహారేళ్ళలో కాని స్నేహం

పదహరేళ్ళ పరిచయం

పడేసుకున్న యవ్వనం

______________
తెలియని Long Island

Rock 'n' Roll Kentucky

దూరం గా విసిరేసిన జ్ఞ్నాపకాలు.

______________
నేస్తం నీ పరిచయం ఒక అలజడి

అవే ఆటు పోట్లు

నా మనసు పడిలేచే కెరటం

Thursday, October 12, 2006

తెలుగు లో పోస్ట్. చెయ్యడానికి

తెలుగు లో పోస్ట్ చెయ్యడానికి http://demo.vishalon.net/TeluguTypePad.htm ఈ URL వాడండి

చిత్రలిపి ఆవిర్భావం !

ఇప్పుడే చూసిన ఓ తెలుగు బ్లాగ్ (http://telugutanam.blogspot.com/) ప్రేరణ తో మరో ఆలోచన లేకుండా ఈ చిత్రలిపి పుట్టింది. ఏ భాష నన్ను ప్రేరేపించిదో అదే భాష మీద మమకారం నా పెద్ద కూతుర్ని "చిత్రలిపి" అని, చిన్నకూతుర్ని "పాళీ" అని పిలిపించింది. ఇల్లంతా బాపు బొమ్మ ల తో నింపింది. ఇకముందు మంచి పోస్ట్ ల తో మీ ముందు కు వస్తాను.